|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

Bandi Bhagirath Arrest : పోక్సో కేసులో సంచలన పరిణామం.. ఎట్టకేలకు బండి భగీరథ్ అరెస్ట్, చర్లపల్లి జైలుకు తరలింపు

Hyderabad, Surya News:తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో (POCSO Case) ప్రధాన నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) ఎట్టకేలకు అరెస్టయ్యాడు. శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో (Petbasheerabad PS) కేసు నమోదైన నాటి నుంచి అతడు కనిపించకుండా పోవడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందనే అనుమానంతో లుక్ అవుట్ నోటీసులు (Lookout Notices) జారీ చేసి దేశంలోని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.

నార్సింగిలోని పోలీసు అకాడమీ (TSPA) వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో భగీరథ్ ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు. అయితే చట్టాన్ని గౌరవిస్తూ తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ అనంతరం రాత్రి 9.30 గంటల సమయంలో నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ప్రత్యేక దర్యాప్తు అధికారి (DCP Rithiraj) సుమారు రెండు గంటల పాటు నిందితుడిని సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం మేడ్చల్ పీహెచ్‌సీ (Medchal PHC) వైద్యాధికారితో స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.

తదనంతరం అర్ధరాత్రి సమయంలో భగీరథ్ ను మేడ్చల్ కోర్టు (Medchal Court) న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. మే 29 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి (Cherlapally Central Jail) తరలించారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలు, ఆమె తల్లి మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. బీఎన్ఎస్ సెక్షన్ 183 (BNSS Section 183) ప్రకారం సుమారు 40 నిమిషాల పాటు వారి వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసి భద్రపరిచింది.

నిందితుడి కోసం గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు కరీంనగర్ (Karimnagar) లోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. శనివారం కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని భగీరథ్ అమ్మమ్మ ఇంట్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును (High Court) ఆశ్రయించినప్పటికీ నిరాశ ఎదురుకావడంతో చివరకు పోలీసులకు చిక్కక తప్పలేదు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp