|  
● FLASH NEWS
VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  •  NFSC : ఫెలోషిప్‌ల జాప్యంపై యువ న్యాయవాది పోరాటం  • 
Skip to content

తెలంగాణలో ఏడుగురు అధికారులకు ఐపీఎస్ హోదా.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సర్కార్

telangana-seven-officials-ips-status-suryanews.jpg
telangana-seven-officials-ips-status

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు నాన్-క్యాడర్ పోలీసు అధికారులకు (ఎస్పీలకు) ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) హోదా వరించింది. రాష్ట్ర పోలీస్ సర్వీస్‌ నుంచి వీరిని ఐపీఎస్‌లుగా (సెలెక్ట్ లిస్ట్-2025) పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ ఉదయ్ ప్రకాష్ గుప్తా ఆగస్టు 24న గెజిట్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐపీఎస్ హోదా దక్కిన అధికారులు వీరే..

  • రవీందర్ పులిగిల్ల
  • బి. శ్రీ బాల దేవి
  • వి. అరవింద బాబు
  • బి. రాజ మహేంద్ర నాయక్
  • బి. సాయి శ్రీ
  • ఐ. పూజ
  • పి. కరుణాకర్

ఈ అధికారులంతా ఇండియన్ పోలీస్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారని కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వీరికి జాతీయ పోలీస్ అకాడమీలో ఇండక్షన్ శిక్షణ (Induction Training) అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలపై సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, యూపీఎస్సీకి పంపించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp