
సూర్య న్యూస్ డెస్క్ : ఆస్ట్రేలియా (Australia) వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం కీలక సూచన చేసింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు అక్టోబర్ 26 నుంచి బయోమెట్రిక్స్ (Biometrics) సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై వీసా దరఖాస్తుదారులు తమ వేలిముద్రలతో పాటు ఫేషియల్ ఇమేజ్ కూడా కచ్చితంగా అందించాల్సి ఉంటుంది.
వీసా దరఖాస్తు చేసుకున్న తర్వాత బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న వారికి ఆస్ట్రేలియా హోమ్ అఫైర్స్ విభాగం నేరుగా ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపుతుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాతే దరఖాస్తుదారులు దేశవ్యాప్తంగా ఉన్న 16 వీఎఫ్ఎస్ కేంద్రాల్లో (VFS Centres) దేనిలోనైనా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు ‘ఆస్ట్రేలియన్ ఇమ్మి’ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్స్ అందించే వెసులుబాటు కల్పించారు.
అయితే, అధికారికంగా హోమ్ అఫైర్స్ విభాగం నుంచి ఈ-మెయిల్ రాకముందే ఎవరూ బయోమెట్రిక్స్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా మార్పులతో ఆస్ట్రేలియా వీసా ప్రక్రియ మరింత పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



