
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో 102 ఖాళీల భర్తీకి బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
మండల్ ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయోపరిమితి, ఫీజు వివరాలు, రాతపరీక్ష తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ను సందర్శించాలని సూచించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



