|  
● FLASH NEWS
AP Politics: ‘జగన్ 2.0’ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర వార్నింగ్  •  Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్  •  Harish Rao: బడుగు, బలహీన వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి  •  Sandalwood: కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు ఎంతంటే?  •  Judge: 5 నెలల్లో 23 మందికి ఉరిశిక్షలు.. సంచలన జడ్జి బదిలీ  • 
Skip to content

Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్

వెలింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బ్యాటర్లు (Team India) సరికొత్త చరిత్ర సృష్టించారు. వెలింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకర శతకంతో చెలరేగగా, భారత జట్టు టీ20 క్రికెట్‌లో పలు సంచలన రికార్డులను నమోదు చేసింది.

4.5 ఓవర్లలోనే 100 పరుగులు

కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన భారత బ్యాటర్లు కేవలం 4.5 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఇది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ తరఫున అత్యంత వేగంగా నమోదైన జట్టు వంద పరుగుల రికార్డు కావడం విశేషం.

అలాగే ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 104 పరుగుల స్కోరును సాధించి, గతంలో ఆఫ్ఘనిస్తాన్‌పై ఉన్న 100 పరుగుల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం.

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 15 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం పూర్తి చేసిన అతడు, ఆ తర్వాత అదే జోరు కొనసాగిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి.

ఈ శతకంతో అభిషేక్ శర్మ పురుషుల టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. తన కెరీర్‌లో 11వ టీ20 సెంచరీ సాధించిన అభిషేక్.. ఇప్పటివరకు పది సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో ప్రస్తుతం అభిషేక్ శర్మ (11), విరాట్ కోహ్లీ (10) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సంజూ శాంసన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తలా 8 సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp