
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన హోస్ట్‌గా ‘మెగావర్స్’ అనే పేరుతో ఓ టాక్ షోను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రేజీ కార్యక్రమాన్ని మొత్తం 15 ఎపిసోడ్లుగా ప్లాన్ చేస్తున్నారని, ఇందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ టాక్ షో గురించి నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వెండితెరపై దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్న చిరంజీవి, ఈ వార్త నిజమైతే ఓటీటీ వేదికగా సరికొత్త కోణంలో ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు ఆయన ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



