
వెలింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు (Team India) నేడు ఆతిథ్య కివీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. వరుసగా రెండు విజయాలతో సిరీస్‌లో జోరుమీదున్న భారత్.. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
మరోవైపు సొంతగడ్డపై ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది.
వెలింగ్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం, పిచ్ పరిస్థితులు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అక్కడ బలమైన గాలులు వీయడంతో పాటు కాస్త వర్షం కూడా కురిసింది. అయితే మ్యాచ్‌కు వర్షం వల్ల పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో ఇక్కడ జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఒక జట్టు 164 పరుగులను విజయవంతంగా కాపాడుకోగా, ఇదే వేదికపై 216 పరుగుల భారీ లక్ష్య ఛేదన కూడా నమోదు కావడం విశేషం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



