
హైదరాబాద్, సూర్య న్యూస్ : నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 1250 స్టేషన్ మాస్టర్ (Station Master) పోస్టుల భర్తీకి బోర్డు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా నవంబర్ 25వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 మేర వేతనం లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



