|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

Radhika Sarathkumar : సీనియర్ నటి రాధికా మూవీ ఓటీటీ ఎంట్రీ.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

హైదరాబాద్, సూర్య న్యూస్: వెండితెరపై దశాబ్దాల కాలంగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి రాధిక (Radhika Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘థాయ్ కిళవి’ (Thai Kizhavi) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి (OTT Platform) అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సంచలన విజయం నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. మలి వయసులోనూ రాధిక తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

ఈ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నిర్మించగా.. ఇందులో రాధిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా వృద్ధురాలిగా మంచానికే పరిమితమైన పాత్రలో ఆమె పండించిన హావాభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా నిర్మాత శివ కార్తికేయన్ లాభాల్లో రాధికకు వాటా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐఎండీబీ (IMDb) రేటింగ్‌లోనూ ఈ సినిమా 8.1 స్కోరుతో దూసుకుపోతోంది.

​కథా నేపథ్యం ఇదే:

ఈ చిత్రంలో రాధిక ముక్కుసూటి మనస్తత్వం గల ఒక బామ్మ పాత్రలో కనిపిస్తారు. ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ కఠినంగా వ్యవహరించే ఆమె.. బాధ్యత లేని తన ముగ్గురు కొడుకులను ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఆమె దగ్గర భారీగా బంగారు నిధి ఉందనే ప్రచారం ఊరిలో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు పక్షవాతం (Paralysis) వచ్చి మాట పడిపోతుంది. నిధిపై ఆశతో కొడుకులు తిరిగి తల్లి వద్దకు చేరుకుంటారు. మాట రాని స్థితిలో ఉన్న బామ్మ వారికి సైగల ద్వారా ఏం చెప్పాలని ప్రయత్నించింది? చివరకు ఆ నిధి ఏమైంది? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌లో (JioHotstar) ఏప్రిల్ 10, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp