
హైదరాబాద్, సూర్య న్యూస్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం ముందుకు వచ్చింది. రేపు అనగా జులై 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) క్యాంపస్ లో భారీ మెగా జాబ్ మేళా (Mega Job Mela) జరగనుంది. ఈ జాబ్ మేళాను తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TTPOA) మరియు జీవీకే ఫౌండేషన్ (GVK Foundation) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ మెగా ఇంటర్వ్యూలు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ (UCE) లో నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఈ వాక్-ఇన్ (Walk-in) ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సరైన సమయానికి తమ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.
ఈ జాబ్ మేళాలో 10వ తరగతి (SSC) నుండి పీజీ (PG) వరకు చదువుకున్న వారు అర్హులు. ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్ (B.Tech), ఎంబీఏ, ఫార్మసీ చదివిన వారు కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. అలాగే 2020 నుండి 2026 మధ్యలో పాస్ అయిన బ్యాచ్ విద్యార్థులు దీనికి హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ వెంట అప్‌డేటెడ్ రెజ్యూమ్, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఫోటో ఐడీ (Photo ID), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి.
ఈ మెగా డ్రైవ్ లో దాదాపు 100కు పైగా కంపెనీలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఎంఆర్ఎఫ్, కియా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా గ్రూప్, టెక్ మహీంద్రా, విప్రో (Wipro) లాంటి 30కి పైగా ప్రముఖ ఎంఎన్సీ (MNC) కంపెనీలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమోటివ్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో దాదాపు 1000కి పైగా ఉద్యోగ ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. అర్హత సాధించిన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు (Offer Letters) అందజేస్తారు.
ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నిర్వాహకులు కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు 93919 27259, 84666 70308, 94417 92625 నంబర్లను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




