|  
FLASH NEWS
వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  • 
Skip to content

Virat Kohli Records : ఇంగ్లాండ్ గడ్డపై రికార్డుల రారాజు.. ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ!

Hyderabad, Surya News: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న ఐదో బంతికి క్లాసిక్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్ గడ్డపై (England Soil) సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ద్రవిడ్ రికార్డుల్లో ఉండేవాడు. ద్రవిడ్ ఇంగ్లాండ్‌లో 56 ఇన్నింగ్స్‌లలో 2645 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ తన 75వ ఇన్నింగ్స్‌లో 40కి పైగా సగటుతో ఆ మైలురాయిని దాటాడు. ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు 3 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 56 ఇన్నింగ్స్‌లలో 2626 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

​ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ తన కెరీర్‌లోని ఒక పాత చెత్త రికార్డును కూడా చెరిపేశాడు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే కార్డిఫ్ (Cardiff) మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. కనీసం ఖాతా కూడా తెరవకుండా వెనుదిరిగిన కోహ్లీ, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ ఆ పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ టాస్ వేసిన వెంటనే కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో కలిపి వంద వన్డే మ్యాచ్‌లు ఆడిన అరుదైన మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో కోహ్లీకి ఇది 35వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp