
మర్రిగూడ (సూర్య న్యూస్ తెలుగు): సీనియర్ జర్నలిస్ట్, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం పర్యవేక్షణలో టీయూడబ్ల్యూజే-143 మర్రిగూడ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా వడ్డే రమేష్ (సాక్షి) ముచ్చటగా మూడోసారి, ప్రధాన కార్యదర్శిగా గుణగంటి యాదయ్య గౌడ్ (మన తెలంగాణ) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా కొంపల్లి నాగరాజు గౌడ్ (ఆంధ్రప్రభ), అబ్దుల్ రజాక్ (జనం సాక్షి), కోశాధికారిగా ఏర్పుల శ్రీశైలం (నవతెలంగాణ), సహాయ కోశాధికారిగా దామెర వినోద్ కుమార్ (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) ఎన్నికయ్యారు. అలాగే, సహాయ కార్యదర్శులుగా బూరుగు నాగరాజు గుప్త (నీలగిరి ఎక్స్ప్రెస్), కుక్కల వెంకటేష్ (విజన్ ఆంధ్ర), కార్యవర్గ సభ్యుడిగా పోలే మల్లయ్య (ప్రజా గొంతుక)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



