- అధ్యక్షుడిగా జీడిమడ్ల బాబు
- ప్రధాన కార్యదర్శిగా జిట్టగోని వెంకటేష్ ఎన్నిక

మునుగోడు: టీయూడబ్ల్యూజే-143 మునుగోడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడి రాములు, ఉపాధ్యక్షుడు కామిశెట్టి యాదయ్యల సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా జీడిమడ్ల బాబు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా జిట్టగోని వెంకటేష్, కోశాధికారిగా దుబ్బ విజయభాస్కర్ ఎంపికయ్యారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది జర్నలిస్టులు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నాయకులు తెలిపారు.



పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



