|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Telangana Gouda Sangham : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మొల్కపురి శ్రీకాంత్ గౌడ్

Hyderabad, Surya News: పదేళ్ల సుదీర్ఘ పోరాటం, నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించింది. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Telangana Gouda Sangham) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం మామిడిపల్లికి చెందిన మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ (Molkapuri Srikanth Goud) నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కార్యాలయంలో గౌడ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని (Appointment Letter) అందుకున్నారు.

గత పది సంవత్సరాలుగా గౌడ విద్యార్థుల కోసం శ్రీకాంత్ గౌడ్ అనేక పోరాటాలు చేశారు. కల్లుగీత వృత్తిలో (Toddy Tappers) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి గాయాలపాలైన ఎంతోమంది కార్మికులకు ఆయన అండగా నిలిచారు. గౌడ జాతి హక్కుల సాధన కోసం అనేక కేసులు నమోదైనా లెక్కచేయకుండా ముందుండి పోరాడారు. ఈ నిరంతర కృషి, సేవా భావాన్ని గుర్తించిన సంఘం ఆయనకు రాష్ట్ర యువజన విభాగం (Youth Wing) బాధ్యతలను అప్పగించింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

రాబోయే రోజుల్లో గౌడ యువత నైపుణ్యాభివృద్ధికి (Skill Development) కృషి చేస్తానని శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. గౌడ విద్యార్థుల కోసం హాస్టళ్ల ఏర్పాటు, ప్రభుత్వాల ద్వారా అందాల్సిన సబ్సిడీల సాధన కోసం పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు (Coaching Centers), కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి యువతీయువకులను ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు.

ఈ నియామక కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్, విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తలూరు కృష్ణమూర్తి గౌడ్, మల్లం శివ గౌడ్, గూడ లింగస్వామి గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు పాల్గొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్, విద్యార్థి సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, హీరో తల్వార్ సుమన్ గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ మరియు గౌడ జర్నలిస్టులకు శ్రీకాంత్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp