
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జనగణన (Census) చేపట్టనున్నట్లు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి వెల్లడించారు. సచివాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు 15 రోజుల ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఇళ్ల గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు డైరెక్టర్ వెల్లడించారు. జనగణన విధుల్లో పాల్గొనే సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలన్నింటినీ జనవరి నాటికి పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



