
హైదరాబాద్, సూర్య న్యూస్ : నిరుద్యోగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నార్త్ వెస్టర్న్ రైల్వే (North Western Railway) పరిధిలో ఏకంగా 2,008 అప్రెంటిస్ (Apprentice Jobs) పోస్టుల భర్తీకి సంబంధించి నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అర్హతలు, వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, దరఖాస్తు గడువు
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు. అభ్యర్థులు అకడమిక్‌గా సాధించిన మార్కుల ఆధారంగా రూపొందించిన మెరిట్ లిస్ట్, ఆ తర్వాత నిర్వహించే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. నవంబర్ 22వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ సమాచారం కోసం అభ్యర్థులు https://www.rrcjaipur.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



