
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థలో మొత్తం 660 ఆర్టిసన్ గ్రేడ్-4 (Artisan Grade-4) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు అధికారిక నోటిఫికేషన్‌లో సూచించారు.
అర్హతలు, ఎంపిక విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC), నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
జీతం, దరఖాస్తుల గడువు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,000 నుంచి రూ.65,000 వరకు వేతనం చెల్లించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. నవంబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర పూర్తి వివరాలు, నోటిఫికేషన్ సమాచారం కోసం అభ్యర్థులు https://careers.bhel.in/index.jsp అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



