|  
● FLASH NEWS
ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  •  Nirmala: ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు.. రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్  •  AP Politics: ‘జగన్ 2.0’ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర వార్నింగ్  •  Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్  • 
Skip to content

జర్నలిస్టుల రక్షణకు కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలి : TWJF డిమాండ్

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూరారంలోని బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ భవన్‌లో బుధవారం ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. 1950లో ఏర్పడిన ఐఎఫ్ డబ్ల్యుజే దేశంలోనే మొట్టమొదటి జర్నలిస్టు సంఘమని, దాని అనుబంధ సంఘంగా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఇవే..

దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు, హత్యలు, అక్రమ కేసులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు కేంద్రం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని నేషనల్ కౌన్సిల్ సభ్యులు జగదీష్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్ కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయుల గుర్తింపు కోసం కేంద్రం వెరిఫికేషన్ నిర్వహించి ‘జర్నలిస్టుల జాతీయ రిజిస్టర్’ను ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే 60 ఏళ్లు పైబడిన సీనియర్లకు జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని, నిలిపివేసిన రైల్వే రాయితీ పాసులను తక్షణమే పునరుద్ధరించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగరాజ్ గౌడ్, జిల్లా నాయకులు పి.శంకర్, కావలి మోహన్, కుత్బుల్లాపూర్ ప్రతినిధులు ఏ.గోవిందరావు, శివకుమార్, సురేష్ గౌడ్ పరుచూరి, కూకట్‌పల్లి ప్రతినిధులు యాకన్న, అంజి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp