|  
● FLASH NEWS
ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  •  Nirmala: ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు.. రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్  •  AP Politics: ‘జగన్ 2.0’ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర వార్నింగ్  •  Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్  • 
Skip to content

మైలారంలో ” ఖేత్ బచావో అభియాన్”

రిపోర్టర్: నరేష్ రెడ్డి జాలి

కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామపంచాయతీలో ” ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, కెవికె జమ్మికుంట సైంటిస్ట్ ప్రశాంతి, హార్టికల్చర్ ఆఫీసర్ రవళి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి EL nino గురించి అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తక్కువ కాలపరిమితి ఉన్న పంట రకాలను ఎంచుకోవాలని చెప్పారు. ఆరతడి పంటలు వైపు రైతు దృష్టి పెట్టాలి అని సూచించారు. ఖేత్ బచావో అభియాన్ ముఖ్య ఉద్దేశమైన – నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని, ఆరుతడి పంటలైన నూనె గింజలు, పప్పు ధాన్యాలు ప్రోత్సహించడం గురించి చెప్పారు.

కె వి కే సైంటిస్ట్ ప్రశాంతి మాట్లాడుతూ నేల ఆరోగ్యం సంరక్షించాలి అంటే రైతులు వరి కొయ్యకాలు, వ్యర్థాలను తగలబెట్టకుండా నేలను కాపాడడం సేంద్రీయ ఉత్పత్తుల వాడకంతో నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అని చెప్పారు. హార్టికల్చర్ ఆఫీసర్ రవళి మాట్లాడుతూ రైతుకి కూరగాయ పంటలు మరియు ఆయిల్ పామ్ పంట లాభసాటిగా ఉంటది అని వివరించారు. ఉద్యానవన శాఖ నుండి రైతుకి డ్రిప్పు సబ్సిడీలో ఉందని తెలిపారు. రైతులు డ్రిప్ సబ్సిడీని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ సర్పంచ్ గాలిపెళ్లి పోచవ్వ గారు,మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, కె వి కే సైంటిస్ట్ ప్రశాంతి, హార్టికల్చర్ ఆఫీసర్ రవళి, AEO వంశీధర్, HEO క్రాంతి, మైలారం సాంబయ్యపల్లి రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp