|  
● FLASH NEWS
ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  •  Nirmala: ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు.. రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్  •  AP Politics: ‘జగన్ 2.0’ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర వార్నింగ్  •  Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్  • 
Skip to content

ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు

సూర్య న్యూస్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియోట్రిస్ కియోల్ (Beatrice Keul) సంచలన ఆరోపణలు చేశారు. 1993లో ట్రంప్ తనపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఓ హోటల్‌లో తనను బంధించి దుస్తులు చించేసి, దారుణంగా రేప్ చేశారని బియోట్రిస్ కియోల్ ఆరోపించారు. ఈ దాడిలో తనకు అనేక చోట్ల గాయాలై రక్తం కూడా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరిస్తూనే.. అమెరికా వీసా, యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాకుండా, మోడలింగ్ కాంటెస్ట్‌ల పేరుతో సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్‌తో కలిసి ట్రంప్ ఎంతోమంది యువతులను లైంగికంగా వేధించేవారని మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే బియోట్రిస్ కియోల్ చేసిన ఈ తీవ్రమైన లైంగిక ఆరోపణలను వైట్ హౌస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp