|  
● FLASH NEWS
Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  •  Elections: ఏపీ మున్సిపల్ సీట్ల సర్దుబాటు ఖరారు.. బీజేపీకి రెండు, మరి జనసేన పరిస్థితేంటి?  •  తెలంగాణను భయపెడుతున్న ఎల్ నినో.. సీఎం ముందస్తు హెచ్చరికల వెనుక వ్యూహమేంటి?  • 
Skip to content

Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి

trump russia diesel deal
trump russia diesel deal

వాషింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : అమెరికా (USA), రష్యాల మధ్య కుదిరిన డీజిల్ సరఫరా ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో డీల్ కుదుర్చుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తూనే, అమెరికాకు మాత్రం ట్రంప్ మినహాయింపులు ఇచ్చుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ టెలివిజన్ షో ‘పియర్స్ మోర్గాన్ అన్‌సెన్సార్డ్’లో పాల్గొన్న జెలెన్‌స్కీ అమెరికా వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యం దెబ్బతినడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, రష్యాకు చెందిన ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేయొద్దని అమెరికా గతంలో చేసిన సూచనలను ఇకపై తాము పట్టించుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను ఆకర్షించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. డీజిల్ ధరలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా తక్షణమే 3 లక్షల టన్నులు, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ డీల్‌తో అమెరికాలో ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్స్ విధించే అధికారంతో కూడిన శాంక్షన్ బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 262-159 ఓట్ల తేడాతో పాస్ అయింది. ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఇది అమల్లోకి రానుంది. అయితే, ఇతర దేశాలపై ఆంక్షలు విధించే ఈ బిల్లు నుంచి అమెరికాకు మాత్రం మినహాయింపు కల్పించారు.

ముఖ్యంగా రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొచ్చారు. కానీ, అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడంతో పాటు, అణు అవసరాల కోసం యురేనియం దిగుమతులను కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే రష్యాకు ఫండింగ్ కట్ చేయాలని గతంలో చెప్పిన ట్రంప్, ఇప్పుడు సొంతంగా డీల్స్ చేసుకోవడం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp