|  
FLASH NEWS
CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  •  PM Modi Ganesh Puja: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని  • 
Skip to content

CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన

హైదరాబాద్, సూర్య న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై (KCR Farmhouse) తక్షణం విచారణ జరిపి 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ భూములపై తక్షణమే నోటీసులు జారీ చేసి, వాటిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచుతామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణ ఉద్యమం, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత పాలకులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం 9 జిల్లాల్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరు మీద ఏకంగా 439.30 ఎకరాల భూమి ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా వివరాలు బయటపెట్టారు. ఇందులో కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరిట 123 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కేటీఆర్ పేరుపై 49.5 ఎకరాలు, శైలిమ పేరిట 17.5 ఎకరాలు, అలేఖ్య పేరుపై 9.38 ఎకరాలు, హిమాన్షు పేరుమీద 46.3 ఎకరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు, సంతోష్‌రావుకు 79 ఎకరాలు, ఇతరుల పేర్ల మీద మరికొన్ని ఎకరాల భూములు ఉన్నట్లు సీఎం రికార్డులను సభ ముందు ఉంచారు.

ఫామ్‌హౌస్‌ ఆక్రమణల భూముల్లో ఎస్సీలే యజమానులు

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ అధీనంలో సుమారు 700 ఎకరాల భూమి ఉందని, అందులో కేసీఆర్ అసలైన పట్టా భూమి ఎంతో తేల్చాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ భూమినైతే వారు గతంలో శుద్ధి చేశారో, అదే భూమికి ఎస్సీలను యజమానులను చేస్తామని స్పష్టం చేశారు. 30 రోజుల్లోగా ఈ విచారణ పూర్తి చేయాలని, ఒకవేళ అధికారులు అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

సత్యం స్కాం భూముల్లోనే కేటీఆర్ ఫామ్‌హౌస్

సత్యం కుంభకోణంలో ఉన్న వివాదాస్పద భూముల్లోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించారని, ఆ భూములు ఆయన బంధువుల పేర్లతో బదిలీ అయ్యాయని సీఎం ఆరోపించారు. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీ నిధులను మళ్లించి హరీశ్ రావు ఫామ్‌హౌస్‌కు రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల్లోనే హరీశ్ రావు ఫామ్‌హౌస్ ఉందని, హైదరాబాద్ బాలానగర్‌లో 120 ఎకరాలను ఆయన కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నారని ముఖ్యమంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp