
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదేపదే చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీకి వస్తారని, అయితే మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఆయన సభలో అడుగుపెడతారని కేటీఆర్ స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడంపై అధికార కాంగ్రెస్ పక్షం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని చెప్పడం ద్వారా, అప్పటివరకు ఆయన సభకు వచ్చే అవకాశం లేదని కేటీఆర్ పరోక్షంగా తేల్చిచెప్పారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి మళ్లీ కేసీఆరేనన్న విషయాన్ని కూడా కేటీఆర్ ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు, భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



