
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పాలనపై ఆయన ఒక చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని స్వర్గంలా మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, గత వెయ్యి రోజులుగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. శాంతిభద్రతల పరిస్థితి క్రమంగా దిగజారుతోందని, ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.50 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన పనులకు రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పగిస్తే, ప్రస్తుతం దాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారని కేటీఆర్ ఆక్షేపించారు. పాలనా వైఫల్యాలు, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ చార్జ్‌షీట్ ద్వారా కాంగ్రెస్ వైఖరిని ఆయన ఎండగట్టారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



