|  
FLASH NEWS
ఆర్టీసీ కార్గో ప్రైవేట్ చేతికి.. 10-15 ఏళ్ల ఒప్పందం, ఛార్జీలపై ఆందోళన  •  గొల్లగుప్ప గ్రామస్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశాలు  •  పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మమతా బెనర్జీ మేనకోడలు మృతి  •  దేశ రాజధానిలో మరో నిర్భయ తరహా దారుణం.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్ల మేర మైనర్‌పై రాక్షసత్వం!  •  SCO సదస్సులో పాకిస్థాన్ ఫొటో ఎడిటింగ్ వివాదం.. అసలు ఫొటోతో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!  • 
Skip to content

గొల్లగుప్ప గ్రామస్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశాలు

AP CM Chandra babu naidu
AP CM Chandra babu naidu

అమరావతి, సూర్య న్యూస్ : పోలవరం ప్రాంతంలోని గొల్లగుప్ప గ్రామంలో పలువురు గ్రామస్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, అస్వస్థతకు దారితీసిన కారణాలపై జిల్లా కలెక్టర్, స్థానిక వైద్యాధికారులతో ఆయన నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు తక్షణమే విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp