|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

Duleep Trophy : 9 సిక్సర్లు, 10 ఫోర్లతో చెలరేగిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavansi Dulip trophy
Vaibhav Suryavansi Dulip trophy

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తనదైన ముద్ర వేశాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 132 పరుగులు సాధించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.

మొత్తం 124 బంతులను ఎదుర్కొని 132 పరుగులు చేసిన వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదాడు. భారీ షాట్లతో విరుచుకుపడి ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలనని ఈ అద్భుత ప్రదర్శన ద్వారా నిరూపించాడు.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదుర్స్

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ వైభవ్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన గెలుపుతో ఈస్ట్ జోన్ జట్టు నేరుగా దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp