|  
● FLASH NEWS
Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  •  Groundwater: తెలంగాణలో డేంజర్ బెల్స్.. 324 మండలాల్లో కరువు పరిస్థితులు  •  ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  • 
Skip to content

RC17: మెగా ఫ్యాన్స్‌కు అప్‌డేట్.. రామ్ చరణ్, సారా అర్జున్ లుక్ టెస్ట్ పూర్తి!

హైదరాబాద్, సూర్య న్యూస్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC17’కి సంబంధించి కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం.

తాజాగా జరిగిన ఈ ఫొటో షూట్‌లో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ సారా అర్జున్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. దీనికోసం ఆయన బరువు తగ్గి, పొడవాటి జుట్టుతో విభిన్నమైన లుక్‌లో మేకోవర్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన కొత్త లుక్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘RC17’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నవంబర్ 1వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా జరగనుందని సమాచారం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp