|  
● FLASH NEWS
Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  •  NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  • 
Skip to content

Suhasini Mulay Marriage : 60 ఏళ్ల వయసులో తొలిసారి పెళ్లి.. ఫేస్‌బుక్ లో పరిచయం.. 7 రోజుల్లోనే పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి

​ముంబై, సూర్య న్యూస్ :ప్రేమకు వయసుతో పనిలేదని చాలామంది చెబుతుంటారు. సరిగ్గా తోడు దొరికితే ఏ వయసులోనైనా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని బాలీవుడ్ (Bollywood) సీనియర్ నటి నిరూపించారు. ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ మూవీ ‘లగాన్’ (Lagaan) లో అమీర్ ఖాన్ కు తల్లిగా నటించిన సుహాసిని ములే తన 60 ఏళ్ల వయసులో మొదటిసారి ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. సరైన జోడీ దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకే ఆరు పదుల వయసు వరకు ఆమె ఒంటరిగానే ఉన్నారు.

సుహాసిని ములే (Suhasini Mulay) కు సోషల్ మీడియా ద్వారా ఒక సైంటిస్ట్ తో పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్ (Facebook) లో ఫిజిసిస్ట్ లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయిన ఆమె, ఎల్ హెచ్ సీ గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో అతనికి మెసేజ్ చేశారు. అలా మొదలైన వారి పరిచయం తర్వాత ఈమెయిల్ (Email) సంభాషణల వరకు వెళ్ళింది. ఈమెయిల్స్ ద్వారా మాట్లాడుకునే క్రమంలోనే అతుల్ తనకు జీవిత భాగస్వామి కావాలని మనసులోని మాటను బయటపెట్టారు.

ఆన్ లైన్ పరిచయం కావడంతో ఆమె మొదట్లో అతన్ని పూర్తిగా నమ్మలేదు. తన ఫోన్ నంబర్ ఇవ్వడానికి కూడా ఆమె నిరాకరించారు. అతుల్ పనిచేసే సంస్థ వెబ్ సైట్ కు వెళ్లి అతని వివరాలను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆమెకు నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. నవంబర్ చివరి వారంలో వారు మొదటిసారి ముఖాముఖి కలుసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎంతో సమయం తీసుకోలేదు.

కేవలం ఏడు రోజుల్లోనే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆలస్యం చేయడం వృధా అనుకుని జనవరి 16, 2011న వివాహ బంధంలోకి (Marriage) అడుగుపెట్టారు. సుహాసిని ములే కేవలం నటి మాత్రమే కాదు. ఇండియన్ సినిమాలో (Indian Cinema) ఆమెకు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది. అస్సామీ, హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ చలనచిత్ర దిగ్గజం సత్యజిత్ రే నిర్మించిన బెంగాలీ చిత్రం ‘జన అరణ్య’కు ఆమె అసిస్టెంట్ గా పనిచేశారు.

ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ జాతీయ అవార్డు సాధించిన ‘మృగయా’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. నటిగా రాణిస్తూనే దాదాపు 60కి పైగా డాక్యుమెంటరీలను రూపొందించారు. వాటిలో నాలుగు డాక్యుమెంటరీలకు గానూ ఆమె ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను (National Film Awards) అందుకోవడం విశేషం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp