
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : వారసత్వ ఆస్తుల (Ancestral Property) పంపకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. తాత నుంచి సంక్రమించిన ఆస్తి పంపకంలో భాగంగా తండ్రికి వాటాగా వచ్చిన భూమిలో మనవడికి ఎలాంటి జన్మతః హక్కు ఉండదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆస్తి పంపకాల తర్వాత తండ్రికి కేటాయించిన వాటా అంతా ఆయన వ్యక్తిగత ప్రత్యేక ఆస్తిగా మాత్రమే పరిగణించబడుతుందని కోర్టు తేల్చిచెప్పింది.
తాత ద్వారా సంక్రమించిన భూమిని తన తండ్రి అమ్ముకున్నారని, ఆ భూమిలో తనకు సగం వాటా రావాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది. తండ్రికి వాటాగా వచ్చిన ఆస్తిపై ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని, దానిలో మనవడు హక్కు కోరలేడని స్పష్టం చేస్తూ సదరు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



