|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

Lawrence Bishnoi Threat : సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు – ఆ నిర్ణయమే స్టార్ హీరో కొంపముంచిందా

Mumbai, Surya News: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) పేరుతో ఒక బెదిరింపు సందేశం రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్టులలో దుండగులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అర్జు బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ (Bishnoi Gang) పేర్లతో విడుదలైన ఈ సోషల్ మీడియా పోస్టులు, ఆడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అమీర్ ఖాన్ మూడో వివాహాన్ని వీరు లవ్ జిహాద్ (Love Jihad) గా అభివర్ణించారు. ఇలాంటి చర్యలను తాము ఎంతమాత్రం సహించబోమని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు తమ సందేశంలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపు ఆడియోలు, పోస్టుల ప్రామాణికతను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఇటీవల అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) ను వివాహం చేసుకోవడంతో కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే (Nitesh Rane) కూడా ఈ వివాహంపై స్పందిస్తూ లవ్ జిహాద్ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

​ఈ లవ్ జిహాద్ వివాదంపై (Love Jihad controversy) అమీర్ ఖాన్ గతంలోనే స్పందించారు. తన వివాహంలో ఎలాంటి మత మార్పిడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు రీనా దత్తా (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao), అలాగే ప్రస్తుత భార్య గౌరీ ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని వెల్లడించారు. తమది అన్ని మతాలను సమానంగా గౌరవించే కుటుంబం అని ఆయన వివరించారు.

తాజాగా అమీర్ ఖాన్ కు వచ్చిన ఈ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల వ్యవహారంపై పోలీసుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్యాప్తు వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp