|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

Shah Rukh Khan Viral Video : గణపయ్య పాదాలపై తల ఉంచి మొక్కిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

shah rukh khan ganapayya viral video
shah rukh khan ganapayya viral video

ముంబై, సూర్య న్యూస్ : ముంబైలోని అత్యంత ప్రసిద్ధ ‘లాల్‌బాగ్చా రాజా’ (Lalbaugcha Raja) గణపతిని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి మండపానికి చేరుకున్న ఆయన, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దర్శన సమయంలో షారుఖ్ ఖాన్ తీవ్ర భక్తిభావంతో గణనాథుని పాదాల వద్ద తల ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన వెంట భార్య గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్ తదితరులు కూడా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాదీ వినాయక చవితి నవరాత్రుల్లో లాల్‌బాగ్చా రాజాను దర్శించుకోవడం బాలీవుడ్ తారలకు, దేశంలోని ప్రముఖులకు ఆనవాయితీగా వస్తోంది.

బారులు తీరిన ప్రముఖులు

లాల్‌బాగ్చా రాజా ఆశీస్సులు పొందేందుకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు క్యూ కడుతున్నారు. షారుఖ్ ఖాన్ కుటుంబం కంటే ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సీనియర్ నటి మధుబాల, ప్రముఖ నటి మౌనీ రాయ్ తదితరులు విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లాల్‌బాగ్చా రాజా మండపం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp