|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

20261019 090635
Pic source : ANI

ముంబై, సూర్య న్యూస్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ ప్రకటించడంతో పాటు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

నిన్న సాయంత్రం జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో బుల్లెట్ గాయాలు కానప్పటికీ.. గన్‌పౌడర్, కారు అద్దాల పెంకులు తగలడంతో టైగర్ ష్రాఫ్ ఛాతీకి, కుడి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆయన డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

ఈ కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ఒక ఆడియో సందేశం ద్వారా సల్మాన్ ఖాన్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. సల్మాన్ వెంటనే లారెన్స్ బిష్ణోయ్‌కు, బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తమను కాదని సల్మాన్‌తో కలిసి పనిచేసే వారిని ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. 2024లో అమెరికాకు పారిపోయిన అనిల్ పండిట్.. అక్కడి నుంచే హ్యారీ బాక్సర్ ఆదేశాలతో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పరామర్శించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

కాల్పుల ఘటన అనంతరం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే.. టైగర్ ష్రాఫ్‌ను స్వయంగా కలిసి పరామర్శించారు. గన్‌పౌడర్, గ్లాస్ ముక్కల వల్లే ఆయనకు గాయాలయ్యాయని ఈ సందర్భంగా షిండే స్పష్టం చేశారు. మరోవైపు, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp