Skip to content

ఓఆర్‌ఆర్‌పై బీభత్సం: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు

ప్రాణాపాయ స్థితిలో పెద్ద కుమార్తె అక్షర నాగ్, ఏఐజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.

హైదరాబాద్, సూర్య న్యూస్ : నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు తీవ్రంగా గాయపడటం తీవ్ర కలకలం రేపుతోంది.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TSPA) సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది, శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న టొయోటా ఫార్చూనర్ (Toyota Fortuner) కారు ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది, డీసీఎం టైరు అకస్మాత్తుగా ఊడిపోయి రోడ్డుపై అడ్డంగా నిలిచిపోవడంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

​ఈ ప్రమాదంలో ఫార్చూనర్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న మాగంటి పెద్ద కుమార్తె అక్షర నాగ్ (Akshara Nag) తల, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు, చిన్న కుమార్తె దిశిర (Dishira) తో పాటు డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి, మరో ప్రయాణికుడు మేడిపల్లి అభిరామ్ రెడ్డికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు, పోలీసుల సాయంతో వెంటనే వారిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి (AIG Hospital) తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

గత ఏడాది మాగంటి గోపీనాథ్ మరణించగా ఇప్పుడు ఆయన కుటుంబంలో ఈ ఊహించని రోడ్డు ప్రమాదం (Road accident) జరగడంతో పలువురు రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు, ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓవర్‌స్పీడ్, వాహన లోపాలపై లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp