|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న?

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు ఇకపై బానిసలు కాదని, పాలకులుగా ఎదిగే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో రెడ్ల గుర్తులను పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. ‘సర్జికల్ స్ట్రైక్ 59’ (Surgical Strike 59) పేరిట నాలుగు కీలక నియోజకవర్గాల లెక్కలను ఆయన బయటపెట్టారు.

కామారెడ్డి, బాల్కొండ నియోజకవర్గాల్లో బీసీలకే మోసం

కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో మొత్తం 2,20,789 ఓట్లు ఉండగా, అందులో బీసీల ఓట్లు ఏకంగా 1,40,630 ఉన్నాయని మల్లన్న తెలిపారు. కానీ కేవలం 9,828 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గ నాయకులే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లి వెంకటరమణ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తూ ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్ల కోసం కోర్టుకెక్కారని మండిపడ్డారు. అలాగే నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural), బాల్కొండ (Balkonda) నియోజకవర్గాల్లోనూ అత్యధిక బీసీ ఓట్లు ఉన్నప్పటికీ, ఆయా పార్టీలు కేవలం రెడ్డి నాయకులకే టికెట్లు ఇస్తూ బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌లో రెడ్లకు రాజకీయ సమాధి

హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో 1,59,068 బీసీ ఓట్లు ఉంటే, కేవలం 18,968 ఓట్లు ఉన్న పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ప్రాతినిధ్యం వహించడం విడ్డూరంగా ఉందని మల్లన్న ఎద్దేవా చేశారు. ఇక్కడ అత్యధికంగా ఉన్న ముదిరాజులు తలుచుకుంటే రాబోయే ఎన్నికల్లో రెడ్లకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP Party) తరఫున బీసీలను బరిలోకి దించి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీసీలను వంచించిన కేసీఆర్, రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి తీవ్ర ద్రోహం చేశారని మల్లన్న విమర్శించారు. ఎన్నికల ముందు ముదిరాజ్ బిడ్డనని చెప్పుకున్న కేసీఆర్, ఆ తర్వాత వారిని మోసం చేశారని అన్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా రెండు కోట్ల మంది బీసీలను వంచించారని ఆయన దుయ్యబట్టారు.

సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

బీసీలను కేవలం అనుచరులుగా కాకుండా చట్టసభలకు పంపే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని మల్లన్న తెలిపారు. ఇందులో భాగంగానే జనగామ టికెట్‌ను డాక్టర్ బిక్షపతి ముదిరాజ్‌కు కేటాయించామని చెప్పారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర (Padayatra) ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2028 నాటికి ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండా ఎగురవేస్తామని, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ వంటి మహనీయులకు సముచిత గౌరవం దక్కేలా చేస్తామని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp