
వరంగల్, సూర్య న్యూస్ : తనకు మంత్రి పదవి పోయిందన్న బాధ ఏమాత్రం లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు. వరంగల్లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవ చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు వరంగల్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి అభివృద్ధి చేసే అవకాశం దక్కిందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇకపై నియోజకవర్గంలోనే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సురేఖ తెలిపారు. రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించారు. ఇదే క్రమంలో తన అనుచరులపై ఈగవాలినా ఊరుకోబోనని ప్రత్యర్థులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాల్
ఎంజీఎం ఆస్పత్రి వద్ద బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని కొండా సురేఖ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు తమలో తాము తోసుకుని, పోలీసులే కొట్టారని ఆరోపిస్తూ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు. మరోవైపు కొత్త కలెక్టరేట్ వద్ద కనీస అవగాహన లేకుండా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులకు ఆమె సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు తీసుకువచ్చి వరంగల్లోని పురాతన ప్రదేశాలను అభివృద్ధి చేసిన తర్వాతే బీజేపీ నేతలు మాట్లాడాలని ఆమె చురకలంటించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



