|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో

హైదరాబాద్, సూర్య న్యూస్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (Former BRS MLA) రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో భాగంగా బెంగళూరులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను లైంగికంగా వేధించారని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు కావడం జరిగింది.

రేగా కాంతారావు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పీఎస్ లో (Panjagutta PS) ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానెల్ పేరుతో ఫ్లాట్ కు పిలిపించి ఆయన వేధించారని ఆమె ఆరోపించింది. తన ప్రైవేటు ఫోటోలతో కాంతారావు బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తున్నారని కూడా యువతి వాపోయింది. అలాగే రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 26న కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైనప్పటికీ ఆరు రోజుల పాటు రహస్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు నమోదు చేసి ఆరు రోజులు గడిచినా దాని వివరాలు బయటకు రాకపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు వివరాలపై హైకోర్టులో కూడా సస్పెన్స్ నెలకొని ఉందని తెలుస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp