|  
● FLASH NEWS
Gowda: గౌడ సామాజిక వర్గ చరిత్రపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ పరిశోధన  •  Local Elections: సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్లు.. రూ.కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు  •  Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  • 
Skip to content

Bongu Venkatesh Goud : వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగుల ఆందోళన

హైదరాబాద్, సూర్య న్యూస్ : వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో (Vanasthalipuram Government Hospital) వైద్య సేవల పట్ల రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల కొరత, మందుల లేమి, సిబ్బంది నిర్లక్ష్యం తదితర సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వసతులు లేవని, వైద్యులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆరోపించారు.

రోగుల ఇబ్బందులు.. సిబ్బంది నిర్లక్ష్యం

దగ్గు, జ్వరం, మలేరియా వంటి సమస్యలతో వచ్చే రోగులకు కనీస చికిత్స అందడం లేదని, మందులు ఇవ్వడం లేదని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ బృందం గుర్తించింది. కనీసం డోలో 650 మాత్రలు కూడా లేవని, మందులు బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని సిబ్బంది చెబుతున్నారని రోగులు వాపోయారు. అలాగే, పరీక్షలకు, ఎక్స్‌రేలకు, బర్త్, డెత్ సర్టిఫికెట్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రసవం కోసం వచ్చే గర్భిణుల పట్ల నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇటీవల ఓ నిండు గర్భిణిని చేర్చుకోకపోవడంతో అంబులెన్స్‌లోనే డెలివరీ అయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిధుల కొరత ఉందన్న సూపరింటెండెంట్

స్థానిక కొనుగోళ్లకు, టీఎస్‌ఎంఐడీసీ నుంచి మందుల సరఫరాకు నిధుల సమస్యలు ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సమగ్ర విచారణ జరపాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరింది. ఈ కార్యక్రమంలో బీసీఫ్ మహిళా అధ్యక్షులు సీత మహాలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నూకల మల్లేష్ యాదవ్, అడ్వకేట్ దినేష్ కుమార్, గుర్రం విజ్ఞాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp