
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) సందడి మొదలైంది. పల్లెల్లో ఎలక్షన్ ఫీవర్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పలుచోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు ఆశావహులు రకరకాల బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి సొంతంగా రూ.కోట్లు ఖర్చు చేస్తామని, మరికొందరు తమ విలువైన ఆస్తులను ఊరికి రాసిస్తామని బహిరంగంగానే హామీలు ఇస్తుండటం గమనార్హం.
భీమవరంలో భూమి.. మార్కాపురంలో నగదు..
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏకగ్రీవాల కోసం వస్తున్న ఆఫర్లు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. భీమవరంలో ఒక అభ్యర్థి తన భార్యను సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామంలోని చెరువు కోసం రెండెకరాల భూమిని ఇస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలో ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధి కోసం ఏకంగా రూ.60 లక్షలు ఇస్తానని ఒకరు ఆఫర్ చేయగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అభ్యర్థి ఏకంగా రూ.కోటి ఇస్తానని ప్రకటించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



