|  
FLASH NEWS
KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  • 
Skip to content

మండలిలో ఎమ్మెల్సీ సత్యం ప్రశ్నల వర్షం..సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలేవి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ?

శాసనమండలి వేదికగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దయనీయ పరిస్థితులు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.

నిలోఫర్ వద్ద మెడికల్ మాఫియా.. జిల్లాల్లో సౌకర్యాల లేమి

జిల్లా, ఏరియా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 2డీ ఎకో, ఎంఆర్ఐ వంటి కనీస సదుపాయాలు లేక రోగులు 200 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు రావాల్సి వస్తోందని ఎమ్మెల్సీ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో కనీస మందులు దొరకని పరిస్థితి నెలకొందని, ఇదే అదునుగా బయట ఉన్న మెడికల్ షాపుల వారు రూ.200 విలువైన మందులను రూ.500 నుంచి రూ.1000కి అమ్ముతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రుల్లో అడ్వైజరీ కమిటీలు పునరుద్ధరించి, మందుల కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కేసులు పెట్టాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఫీజులు చెల్లించలేదనే సాకుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, అలాంటి వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ సత్యం డిమాండ్ చేశారు. విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించి, ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp