|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్

హైదరాబాద్, సూర్య న్యూస్ : హెచ్‌ఎంటీ (HMT) రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర న్యాయబద్ధమైన చెల్లింపుల కోసం హెచ్‌ఎంటీ మిషన్ టూల్స్ కంపెనీకి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం కుత్బుల్లాపూర్‌లో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

దశాబ్దాల పాటు సంస్థకు సేవ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం న్యాయబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం జరగకుండానే కన్నుమూసిన 40 మంది

ఉద్యోగుల డిమాండ్లను ఇప్పటికే పలుమార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లామని వివేకానంద్ గుర్తు చేశారు. 2023లో హెచ్‌ఎంటీని సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. తమకు రావాల్సిన న్యాయబద్ధమైన చెల్లింపులు అందకుండానే దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు కన్నుమూయడం తీవ్ర బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి ఐక్యంగా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే సూచించారు. వారి హక్కుల సాధనలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు బిఎన్ మధుకృష్ణ, నారాయణ రెడ్డి, ఆర్ మహేందర్, రాములు గౌడ్, రవీందర్, బిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp