|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

Education: దేశంలో విద్యా వ్యవస్థకు ఆజాద్ పునాదులు: సీఎం రేవంత్ రెడ్డి

ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్.. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు

హైదరాబాద్, సూర్య న్యూస్ :
స్వాతంత్ర్యానంతరం దేశ తొలి విద్యా శాఖ మంత్రి వేసిన పునాదులే నేటి విద్యా వ్యవస్థకు ఆధారమయ్యాయి. ఆయన హయాంలో రూపుదిద్దుకున్న విద్యా విధానం, ప్రముఖ విద్యా సంస్థల స్థాపన దేశ అభివృద్ధికి దోహదం చేశాయి.

భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రాష్ట్ర మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతరం పండిత్ నెహ్రూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, ఆయన కేబినెట్‌లో విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో ఐఐటీల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఆయన హయాంలోనే దేశ విద్యా విధానానికి రూపురేఖలు ఏర్పడ్డాయని, ప్రముఖ విద్యా సంస్థల స్థాపనతో దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాయని కొనియాడారు.

నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట..

మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం విద్యాభ్యాసమే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు (Skills) ఉన్నవారికే అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని సీఎం స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రాథమిక విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి, ఆవిష్కరణలకు పెద్దపీట వేసేలా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. మైనారిటీ యువతలో ప్రతిభ ఉన్న వారు చాలా మంది ఉన్నారని, వారిని ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. బ్లూకాలర్ జాబ్స్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించామని తెలిపారు.

మైనారిటీల ప్రగతితోనే దేశాభివృద్ధి..

దేశ జనాభాలో 15 శాతంగా ఉన్న మైనారిటీ వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం పురోగమిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. వారిలో పేదరికాన్ని నిర్మూలించే ఉద్దేశంతోనే సచార్ కమిటీ సిఫార్సుల మేరకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, వి. హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, TGMREIS వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp