|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

బందగీకి కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్గొండ: తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ మైనొద్దీన్‌ పెద్ద కుమారుడు బందగీ అకాల మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందగీ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మైనొద్దీన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్న వయసులోనే బందగీ మృతి చెందడం బాధాకరమని, నిరంతరం ప్రజా, రైతు సమస్యలపై పోరాడే మైనొద్దీన్ కుటుంబానికి ఇది తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి సహా ఇతర సీపీఐ, రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp