
రూ.24.26 కోట్ల రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మర్రిగూడ/నారాయణపూర్/గట్టుప్పల్: మునుగోడు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ, గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గట్టుప్పల్ మండలం అంతంపేటలో సుమారు రూ.24.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండు కీలక రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. నారాయణపూర్ మండలం లచ్చమ్మగూడెం నుండి అంతంపేట వరకు రూ.10.76 కోట్లతో, అలాగే అంతంపేట నుండి మర్రిగూడ మండలం శివన్నగూడెం వరకు రూ.13.50 కోట్లతో నూతన రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని, ఇచ్చిన మాట ప్రకారం మారుమూల గ్రామాలకు సైతం నాణ్యమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



