|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Gajularamaram UGD Works : గాజులరామారం శ్రీవృద్ధి ఎన్‌క్లేవ్‌లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన కూన శ్రీశైలం గౌడ్

Gajularamaram, Surya News: గాజులరామారం (Gajularamaram) సర్కిల్ పరిధిలోని శ్రీవృద్ధి ఎన్‌క్లేవ్‌లో రూ.19.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులకు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఈ కొత్త పనులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పనులను ప్రారంభించిన అనంతరం ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుల ప్రత్యేక కృషితోనే ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్ (Quthbullapur) నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం తన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. తమ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు శ్రీవృద్ధి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే వేదికపైనుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (SSR) కార్యక్రమంపై ఆయన అవగాహన కల్పించారు. అర్హులైన కాలనీవాసులందరూ దరఖాస్తులు సమర్పించి తప్పనిసరిగా ఓటు హక్కును (Voting Right) పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూన శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, అసోసియేషన్ ప్రతినిధులు వల్లపు వేణుకుమార్, సత్యనారాయణ, సుభాస్కర్ రెడ్డి, ప్రవీణ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp