
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖ (Konda Surekha) ను ప్రభుత్వం తక్షణమే అమలులోకి వచ్చేలా అధికారికంగా బర్తరఫ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు (Press Communique) వెలువడ్డాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) పంపిన లేఖపై గవర్నర్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి స్వయంగా లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసినట్లు సమాచారం. సీఎం సమక్షంలోనే కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్‌పై గవర్నర్ సంతకం చేసినట్లు తెలిసింది.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించి సురేఖపై వేటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధిష్ఠానం ఆదేశాలతోనే ముఖ్యమంత్రి ఈ కఠిన నిర్ణయం తీసుకుని, అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



