|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) పథకాలకు సంబంధించి హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన జీవోల వాలిడిటీపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

​ఈ పథకాలకు అసెంబ్లీలో సరైన చట్టబద్ధత కల్పించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (GOs) ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగంలోని (Constitution) ఆర్టికల్ 245, 246 లకు విరుద్ధమని న్యాయవాది విజయ్ గోపాల్ వాదించారు. గత విచారణ సమయంలోనే దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం తరఫున ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదు. ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ పథకాల జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) జారీ చేసింది. తదుపరి విచారణలోగా పూర్తిస్థాయి ఆధారాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తాజా నిర్ణయంతో లబ్ధిదారుల్లో (Beneficiaries) ఆందోళన నెలకొంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp