|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Universities: రాష్ట్రంలోని వర్సిటీల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉన్నత విద్యా శాఖ శుభవార్త అందించింది. రాష్ట్ర పరిధిలోని ఏడు యూనివర్సిటీల్లో (State Universities) ఖాళీగా ఉన్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో ఎంఎస్ నంబర్ 142ను (తేదీ: 18.10.2026) విడుదల చేశారు. మొదటి దశ కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఈ 429 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంబంధిత వర్సిటీల రిజిస్ట్రార్లు మరియు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి తక్షణమే రోస్టర్, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులంటే..

ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా జీవో ప్రకారం అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీలో 252 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో 49, శాతవాహన యూనివర్సిటీలో 49 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

వీటితో పాటు పాలమూరు యూనివర్సిటీలో 45 పోస్టులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 16, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 16, తెలంగాణ యూనివర్సిటీలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఆయా యూనివర్సిటీల్లోని వివిధ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుండగా.. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp