
వాషింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : అమెరికాలో ప్రతిష్టాత్మక హెచ్-1బీ వీసా (H-1B Visa) విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ పూర్తిగా విఫలమైందని, దీనిని తక్షణమే రద్దు చేయాలని అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ డిమాండ్ చేశారు. అత్యధికంగా భారత్, చైనాల నుంచి వస్తున్న వీసాదారులను తక్కువ జీతానికి పనిచేసే ‘చీప్ లేబర్’ గా వారు అభివర్ణించారు.
హెచ్-1బీ వీసా వ్యవస్థను ఐటీ కంపెనీలు తమ స్వలాభం కోసం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయని జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఆరోపించారు. ఏటా 60 వేల డాలర్లు సంపాదించే అమెరికన్ పౌరుడి స్థానంలో కేవలం 45 వేల డాలర్లకే పనిచేసే వలసదారులను కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అత్యంత ప్రతిభావంతుల కోసం ఈ ప్రోగ్రామ్ను తీసుకువస్తే, కంపెనీలు తక్కువ జీతాలకు పనిచేసే వారిని తీసుకుంటున్నాయని, ఇది నేరుగా అమెరికన్ల ఉద్యోగాలను నాశనం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
మరో యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ సైతం హెచ్-1బీ వీసా విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో సుమారు 6.50 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఉంటే, కంపెనీలు మాత్రం వారిని కాదని భారత్, చైనాలకు చెందిన 5 లక్షల మంది వీసాదారులకు తక్కువ జీతాలకే ఉద్యోగాలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా అర్థరహితమని, స్థానికులకు అన్యాయం చేస్తున్న ఇటువంటి మోసపూరిత విధానాలను తక్షణమే ఎత్తివేయాలని మూర్ స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



