|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Airtel: డేటా లేకుండా ఎయిర్‌టెల్ 3 కొత్త ప్లాన్లు.. పూర్తి వివరాలివే

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన కస్టమర్ల కోసం మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Prepaid Plans) అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా ఆదేశాల మేరకు, కేవలం కాలింగ్ సదుపాయం మాత్రమే కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇంటర్నెట్ డేటా లేకుండా ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

కొత్తగా ప్రకటించిన ఈ మూడు ప్లాన్ల ద్వారా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయంతో పాటు 300 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో మొదటి ప్లాన్ ధర రూ.185 కాగా, దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. రూ.203 తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక మూడవ ప్లాన్ రూ.206 కు అందుబాటులో ఉండగా, ఇది పూర్తి క్యాలెండర్ నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఈ ప్లాన్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండదు కాబట్టి, స్మార్ట్‌ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే, ఇళ్లు లేదా ఆఫీసుల్లో ఎల్లప్పుడూ వైఫై (WiFi) వాడుతూ కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అనవసరమైన డేటా ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి అత్యుత్తమ ఎంపికగా మారనున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp