|  
FLASH NEWS
Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  • 
Skip to content

TRAI New Rules : స్పామ్ కాల్స్‌కు చెక్.. కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ట్రాయ్, ఆ నంబర్ల కనెక్షన్ కట్!

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : మొబైల్ వినియోగదారులను నిత్యం వేధిస్తున్న స్పామ్ కాల్స్ (Spam Calls), అనవసర మెసేజ్‌లను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా స్పామ్ కార్యకలాపాలకు పాల్పడే నంబర్లను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగిస్తూ నిబంధనలను కఠినతరం చేసింది.

10 రోజుల్లో తేలితే విచారణ

తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఒక వ్యక్తి లేదా ఏదైనా సంస్థకు చెందిన 5 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు 10 రోజుల వ్యవధిలో స్పామ్ చేస్తున్నట్లు గుర్తిస్తే టెలికాం సంస్థలు తక్షణమే విచారణ చేపడతాయి. ఈ దర్యాప్తులో సదరు నంబర్ల ద్వారా తప్పుడు కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే, వెంటనే కేవైసీ రీవెరిఫికేషన్ చేయడంతో పాటు కనెక్షన్‌ను పూర్తిగా కట్ చేస్తారు.

ఆ సిరీస్ నంబర్లకు మినహాయింపు

మరోవైపు బ్యాంకింగ్, వాణిజ్య సంస్థలు ఉపయోగించే అధికారిక నంబర్ల విషయంలో ట్రాయ్ కీలక సూచనలు చేసింది. 140, 1600, 1601 సిరీస్‌లతో వచ్చే అధికారిక కాల్స్‌ను ట్రూకాలర్ లాంటి కాలర్ ఐడీ యాప్‌లు బ్లాక్ చేయకూడదని, అలాగే వాటిని స్పామ్‌గా ట్యాగ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ తాజా నిబంధనలతో సామాన్య ప్రజలకు స్పామ్ కాల్స్, ఫేక్ మెసేజ్‌ల బెడద గణనీయంగా తగ్గనుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp